ఈ వారం 'చిత్ర భారతం'

మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లర్, నాగ్‌పూర్ టెస్టులో భారత్ ఘనవిజయంతో పాటు ఈ వారం భారత్‌లో జరిగిన ప్రధాన ఘటనలు, వార్తలు, విశేషాల సమాహారం ఈ 'చిత్ర భారతం'.

మానుషి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాలో జరిగిన మిస్ వరల్డ్ 2017 పోటీల్లో టైటిల్ గెల్చుకుని భారత్ వచ్చాక తొలిసారిగా ముంబయిలో మీడియాతో మాట్లాడుతున్న మానుషి చిల్లర్
సిక్కు బాలుడు

ఫొటో సోర్స్, Khushal Lali

ఫొటో క్యాప్షన్, గురు తేగ్ బహదూర్ వర్థంతి సందర్భంగా ఓ గురుద్వారా ముందు ఫ్లూట్ వాయిస్తున్న సిక్కు బాలుడు.
పంజాబ్

ఫొటో సోర్స్, Khushal Lali

ఫొటో క్యాప్షన్, చండీఘడ్ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన కల్చరల్ ఫెస్ట్‌లో పంజాబీ సంస్కృతిని తెలియచేస్తున్న మహిళల శిల్పాలు
జీఈఎస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును ప్రారంభించిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు ఇవాంకా ట్రంప్‌లిద్దరూ ఓ రోబోను పరిశీలిస్తున్న దృశ్యం.
యాంటీ పైరసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నవంబరు 28న జైలు నుంచి విడుదలైన తర్వాత తన సహోద్యోగి నిక్ సింప్సన్ వైపు చూస్తూ అభివాదం చేస్తున్న బ్రిటిష్ యాంటీ పైరసీ బృంద సభ్యుడు జాన్ ఆర్మ్‌స్ట్రాంగ్. అక్రమ ఆయుధాలు కలిగిఉన్నారనే ఆరోపణలపై అరెస్టైన 35 మందిలో ఆరుగురు నిర్దోషులుగా చెన్నైలో జైలు నుంచి విడుదలయ్యారు.
కశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహ్మద్ ప్రవక్త గడ్డంలోనిది అంటూ ఓ మత పెద్ద చూపించిన వెంట్రుకపై కశ్మీర్లో అలజడి రేగింది. మిలాద్ ఉన్ నబీ ప్రార్థనల్లో భాగంగా కశ్మీర్లోని హజ్రత్ మసీదు వద్ద మహిళలు.
క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీలంకతో నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టులో విజయం సాధించిన ఆనందంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్.
ఓఖీ తుపాను

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేరళ, తమిళనాడుల్లో ఓఖీ తుపాను ధాటికి విస్తారంగా కురుస్తున్న వర్షాలు.