స్ఫూర్తి: బాల్య వివాహాన్ని తప్పించుకుంది.. ‘ఐఏఎస్‘ అవుతానంటోంది
రిపోర్టింగ్: శ్రీకాంత్ బంగాలే, అమేయ్ పాఠక్
పన్నెండేళ్ల వయసులో తల్లిదండ్రులు సునీతకు పెళ్లి చేయాలనుకున్నారు. ఆమె పెళ్లొద్దని ఎంత ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. అయినా ఆమె పట్టు వీడలేదు. విద్యాశాఖ అధికారుల్ని ఆశ్రయించింది. తల్లిదండ్రుల ప్రయత్నాలను అడ్డుకుంది.
మహారాష్ట్రలోని జాల్నా జిల్లా, నందపూర్ గ్రామానికి చెందిన సునీత ఏడో తరగతిలో ఉండగా బాల్య వివాహం బారి నుంచి బయటపడింది. ఇప్పుడామె పన్నెండో తరగతి చదువుతోంది.
చదువుకుంటూనే మరోపక్క ‘సర్వ శిక్ష అభియాన్’ బృందంతో కలిసి బాల్యవివాహాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తోంది. ఆ రోజు ధైర్యంగా ఎదురు చెప్పకపోయుంటే ఈ రోజు తన పరిస్థితి మరోలా ఉండేదని సునీత చెబుతోంది.
గతంలో ఆమె చూపిన తెగువ ఇప్పుడు ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)