ఈ మర్రి ఎన్నో ప్రాణులను సేద దీర్చే అమ్మ ఒడి

3 శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ పురాతన మర్రి చెట్టు పంజాబ్‌లోని చోల్టీ ఖేడిలో ఉంది. దీని ఊడలు 3.5 ఎకరాలు మేర విస్తరించి ఉన్నాయి. దీనిపై బీబీసీ పంజాబీ ప్రతినిధి దల్జిత్ అమీ ఫొటో కథనం.

Banyan Tree
ఫొటో క్యాప్షన్, ప్రఖ్యాత అర్నిథాలజిస్ట్ సలీం అలీ 1,231 జాతుల పక్షులు భారత్‌లో ఉన్నట్లు గురిస్తే ఒక్క పంజాబ్‌లోనే 550 జాతుల పక్షులున్నట్లు తాము గుర్తించామని జంతు, పర్యావరణ శాస్త్ర విభాగ ప్రొఫెసర్ ఓంకార్ సింగ్ తెలిపారు. ఇందులో 25 జాతులు ఈ మర్రి చెట్టు మీదే ఉన్నాయన్నారు.
Banyan Tree
ఫొటో క్యాప్షన్, 200 నెమళ్లు, లెక్కలేనన్ని పాములు కూడా ఈ మర్రిచెట్టును ఆశ్రయించి ఉన్నాయని సరబ్జిత్ సింగ్ అనే రైతు తెలిపారు. మే, జూన్‌లలో పాములు చెట్టుపైకి వస్తాయని అయితే అవి ఎవరినీ కాటు వేయవని చెప్పారు.
Banyan Tree
ఫొటో క్యాప్షన్, ఈ మర్రి చెట్టును దేవుడిగానే భావిస్తామని, కోరిన కోరికలను ఇది తీర్చుతుందని స్థానికంగా ఉన్న గుడి పుజారి చెబుతున్నారు.
Banyan Tree
ఫొటో క్యాప్షన్, ఈ మర్రి చెట్టు 3.5 ఎకరాల్లో విస్తరించి ఉందని, దీని ఊడలను ఎవరూ కత్తిరించరని స్థానిక రైతు మల్కిత్ సింగ్ చెప్పారు. రైతులు తమ పొల్లాల్లో విస్తరించిన మర్రి ఊడలను అలానే వదిలేస్తారని అన్నారు.
Banyan Tree
ఫొటో క్యాప్షన్, రకరకాల పక్షులకు ఈ చెట్టే కూడు, గూడు కల్పిస్తోంది. అత్తిపళ్లు, క్రిమికీటకాలను తినేందుకు కొన్ని జంతువులు ఈ చెట్టును ఆశ్రయిస్తుంటాయి. ఆహార చక్రానికి ఈ చెట్టు ఓ ఉదాహరణగా చెప్పొచ్చు.
Banyan Tree
ఫొటో క్యాప్షన్, వేరే రకాల మొక్కలు ఏపుగా పెరగడానికి ఈ మర్రి చెట్టు ఎరువుగా కూడా పనిచేస్తుంది. మర్రిచెట్టు కొమ్మల మధ్యన పుట్టగొడుగులు పెరుగుతున్నాయి. ఈ చెట్టును జీవవైవిధ్య ప్రాంతంగా పంజాబ్ బయోడైవర్సిటీ బోర్టు ప్రకటించింది.
Banyan Tree
ఫొటో క్యాప్షన్, ఈ చెట్టు కొమ్మలపై నుంచి పడే వెలుగునీడలతో ఈ ప్రాంతమంతా కొత్త అందాలను సంతరించుకుంటుంది.