చనిపోయాక పెళ్లికూతురైన బాలీవుడ్ హీరోయిన్

స్మితా పాటిల్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా.. మిర్చ్ మసాలా. ఆ సినిమాను ప్రత్యేకంగా గుజరాత్‌లో మిర్చి సీజన్‌లోనే చిత్రీకరించారు.

స్మితా పాటిల్

ఫొటో సోర్స్, KETAN MEHTA

ఫొటో క్యాప్షన్, అక్టోబర్ 17, 1956 న జన్మించిన స్మితా పాటిల్, పదేళ్లపాటు చిత్రరంగంలో ఉన్నారు. రాజ్ బబ్బర్‌తో ఆమె వివాహం చాలాకాలం చర్చనీయాంశమైంది. 31 ఏళ్లకే చనిపోయిన స్మితా పాటిల్ మరణం నేటికీ ఒక మిస్టరీ.
స్మితా పాటిల్, మిర్చ్ మసాలా

ఫొటో సోర్స్, KETAN MEHTA

ఫొటో క్యాప్షన్, ఎలాంటి క్లిష్టమైన పాత్ర చేయడానికైనా స్మితా పాటిల్ సిద్ధంగా ఉండేవారని శ్యామ్ బెనగల్ అంటారు. ఏ పాత్రలోనైనా లీనమై నటించడం స్మితా పాటిల్ ప్రత్యేకత.
స్మితా పాటిల్, మిర్చ్ మసాలా

ఫొటో సోర్స్, KETAN MEHTA

ఫొటో క్యాప్షన్, స్మితా పాటిల్ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. పుట్టిన వెంటనే నవ్వడంతో ఆమె తల్లి విద్యాతాయ్ పాటిల్ ఆమెకు ‘స్మిత’ అన్న పేరు ఖరారు చేశారు. స్మితా పాటిల్ చాలా సీరియస్ సినిమాల్లో నటించినా, నిజజీవితంలో ఆమె చాలా సరదా మనిషి.
మైథిలీ రావ్, స్మితా పాటిల్
ఫొటో క్యాప్షన్, సినిమాల్లోకి రావడానికి ముందు స్మితా పాటిల్ ముంబై దూరదర్శన్‌లో మరాఠీ వార్తలు చదివేవారు. వార్తలు చదివే వాళ్లు ఖచ్చితంగా చీర ధరించాలన్న నియమం ఉండేది. అయితే స్మితా పాటిల్‌కు జీన్స్ అంటే ఇష్టం. అందువల్ల ఆమె జీన్స్ పైనే చీర ధరించి వార్తలు చదివేవారు.
షూటింగ్, స్మితా పాటిల్

ఫొటో సోర్స్, SHYAM BENEGAL

ఫొటో క్యాప్షన్, ఒక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థి తన డిప్లమో కోసం తీసిన చిత్రంతో ఆమె కెరీర్ ప్రారంభమైంది. 1977లో స్మితా పాటిల్ జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని అందుకున్నారు. 1981లో ‘చక్ర’ సినిమాకు మరోసారి అదే అవార్డు సాధించారు.
స్మితా పాటిల్, శ్యామ్ బెనగల్, మిర్చ్ మసాలా

ఫొటో సోర్స్, SHYAM BENEGAL

ఫొటో క్యాప్షన్, మిర్చ్ మసాలా చిత్రం స్మితా పాటిల్ మరణాంతరం విడుదలైంది. కానీ ఆమె నటించిన ‘సోన్ బాయ్’ పాత్ర మాత్రం ప్రేక్షకుల మదిలో కలకాలం నిలిచిపోయింది.
స్మితా పాటిల్, నసీరుద్దీన్ షా, మిర్చ్ మసాలా

ఫొటో సోర్స్, KETAN MEHTA

ఫొటో క్యాప్షన్, మిర్చ్ మసాలా సినిమాను గుజరాత్‌లో మిర్చి సీజన్‌లో చిత్రీకరించారు. ఆ సినిమా షూటింగ్ కోసం స్మితా పాటిల్ ఇతర సినిమా డేట్లను సర్దుబాటు చేసుకున్నారు.
స్మితా పాటిల్

ఫొటో సోర్స్, SUPRIYA SOGLE

ఫొటో క్యాప్షన్, రాజ్ బబ్బర్‌తో వివాహం స్మితా పాటిల్ తల్లికి ఇష్టం లేదు. డిసెంబర్ 13, 1986న కుమారుడు ప్రతీక్ బబ్బర్‌కు జన్మనిచ్చి స్మితా పాటిల్ కన్నుమూశారు. ఆమె మెదడుకు ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు పేర్కొన్నారు.
స్మితా పాటిల్, శ్యామ్ బెనగల్, షబానా అజ్మీ

ఫొటో సోర్స్, SHYAM BENEGAL

ఫొటో క్యాప్షన్, తాను చనిపోయాక తనను పెళ్లికూతురిలా అలంకరించాలనేది స్మితా పాటిల్ ఆఖరి కోరిక. ఆమె కోరిక మేరకు మేకప్ ఆర్టిస్ట్ దీపక్ సావంత్ అలాగే అలంకరించారు. మరణించినా ఆమె పెదాల మీద చిరునవ్వు చెరగలేదని దీపక్ తెలిపారు.