భూసేకరణకు వ్యతిరేకంగా రాజస్థాన్ రైతుల వినూత్న నిరసన

రాజస్థాన్‌లో ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు 'జమీన్ సమాధి సత్యాగ్రహ'ను చేపట్టారు. జైపూర్ సమీపంలోని నిందడ్ గ్రామంలో మెడలోతు గుంతల్లోకి దిగిపోయారు.

గుంతల్లో పూడ్చుకుని నిరసన తెలుపుతున్న రైతులు

ఫొటో సోర్స్, COPYRIGHTS

ఫొటో క్యాప్షన్, మూడు రోజులుగా రైతులు ఈ గుంతల్లోనే ఉంటున్నారు. ‘‘ప్రాణం పోయినా అడుగు భూమి కూడా ఇచ్చేది లేదు’’ అని రైతులు తేల్చిచెబుతున్నారు.
గుంతల్లో కూర్చుని నిరసన తెలుపుతున్న మహిళలు

ఫొటో సోర్స్, COPYRIGHTS

ఫొటో క్యాప్షన్, ఈ సత్యాగ్రహంలో మహిళలు కూడా పాల్గొంటున్నారు. రెండు రోజులుగా పురుషులకు మద్దతుగా వీళ్లూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ''మాకు ఉన్నదే కాస్తంత భూమి. నాకు అయిదుగురు కొడుకులున్నారు. ఉన్నది కాస్త ప్రభుత్వానికి ఇచ్చేస్తే మా పిల్లలు ఏం చేయాలి? వీధుల్లో అడుక్కోవాలా?'' అని ఓ మహిళ ప్రశ్నిస్తున్నారు.
ఎండకు సొమ్మసిల్లి పడిపోయిన మహిళలు

ఫొటో సోర్స్, COPYRIGHTS

ఫొటో క్యాప్షన్, 520 ఎకరాల భూమి కావాలని ప్రభుత్వం కోరుతున్నట్లు రైతులు చెబుతున్నారు. పగలు ఇక్కడ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు చేరుతున్నాయి. ఎండకు తాళలేక కొందరు సొమ్మసిల్లి పడిపోతున్నారు.
గుంతల్లో పూడ్చుకుని నిరసన తెలుపుతున్న రైతులు

ఫొటో సోర్స్, COPYRIGHTS

ఫొటో క్యాప్షన్, ఈ ఉద్యమం చుట్టుపక్కల గ్రామాలకూ విస్తరిస్తోంది. ‘‘ప్రభుత్వం చేపడుతున్న ఈ భూసేకరణ కారణంగా వేల మంది రోడ్డున పడతాం. ఈ సమస్య పరిష్కారానికి వారి వద్ద సరైన విధానమే లేదు’’ అని బీర్బల్ చౌధరి అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుంతల్లో కూర్చుని నిరసన తెలుపుతున్న మహిళలు

ఫొటో సోర్స్, COPYRIGHTS

ఫొటో క్యాప్షన్, 80 ఏళ్ల మహిళ కూడా రెండు రోజులుగా ఈ నిరసనలో పాల్గొంటున్నారు. తమ భూములు లాక్కోవడం అభివృద్ధి అవుతుందా..? లేక మా బతుకులు నాశనం చేయడమా..? అని ఆమె ఆక్రోశిస్తున్నారు.
గుంతల్లో పూడ్చుకుని నిరసన తెలుపుతున్న రైతులు

ఫొటో సోర్స్, COPYRIGHTS

ఫొటో క్యాప్షన్, జైపూర్ అభివృద్ధి ప్రాధికార సంస్థ భూసేకరణ ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు జరుగుతున్నా అవి సఫలం కావడం లేదు.