సోనాలీ-సుమంత్: ఆడిషన్స్‌లో అదరగొట్టిన ఈ జోడీ డాన్స్ వీడియో వైరల్ అయింది
'అమెరికా'స్ గాట్ టాలెంట్ షో' తమ అద్భుతమైన డాన్స్‌తో మెప్పించిన సోనాలీ, సుమంత్ గురించి ఇప్పడు ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఆడిషన్స్‌లో వారు చేసిన డాన్స్ వీడియో వైరల్ అయింది.
సోనాలీ-సుమంత్‌ల నాట్య ప్రదర్శనకు న్యాయ నిర్ణేతలు ఎంతగా ముగ్ధులయ్యారంటే, వారు ఆ జంటను నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు పంపించారు.
సోనాలీ మజుందార్ ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చింది. చిన్నప్పటి నుంచే తనకు డాన్స్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. సుమంత్ కూడా సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడే. ఇప్పుడీ జోడీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.